కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు అమ్మవారు గజలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఉదయం అమ్మవారి సుప్రభాతం తో ప్రారంభమై అభిషేకం, ప్రత్యేకమైన అలంకరణతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. అనంతరం గోమాత సేవలు, కలశ స్థాపన, అఖండ దీపారాధన మరియు దంపతులచే సామూహిక కుంకుమార్చనలు చేయడం జరిగింది. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం దేవతలందరికీ నైవేద్య సమర్పణ,మహా మంగళహారతి ఇవ్వడం జరిగింది. భక్తులకు భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం స్త్రీలచే పారాయణం, దాండియా, కోలాటములు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు ఆర్యవైశ్య సంఘం అనుబంధ అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News