Thursday, 17 September 2026 08:33:17 AM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గా అశ్విని చంద్ర శేఖర్

Date : 09 October 2024 07:10 PM Views : 1249

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అతి పెద్ద ఉపాధ్యాయ సంఘమైన పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గా మహబూబ్ నగర్ కు చెందిన ఆ యూనియన్ సీనియర్ నేత అశ్విని చంద్ర శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పి ఆర్ టి యూ టి ఏస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు గా పింగళి శ్రీ పాల్ రెడ్డి, ప్రధాన కార్య దర్శిగా పులగం దామోదర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా పి ఆర్ టి యూ టి ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి.మదన్ మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి ల ప్రతి పాదన మేరకు రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష పదవికి అశ్విని చంద్ర శేఖర్ తిరిగి రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్ జి టి ఉపాధ్యాయులు గా విధులు నిర్వర్తిస్తున్న అశ్విని చంద్ర శేఖర్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 17 అక్టోబర్ 2002 న నియామక మైన నాటి నుంచి నేటి వరకు 22 ఏళ్లుగా ఒక వైపు విద్యా భివృద్ధికి అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ మరో వైపు ఉపాధ్యాయ సమస్యల సాధనయే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న పి ఆర్ టి యూ టి ఎస్ లో ప్రాథమిక, క్రియాశీలక సభ్యులుగా మండల ప్రధాన కార్యదర్శి గా, అధ్యక్షులుగా, జిల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా సమర్థవంతంగా పనిచేస్తూ ఉపాధ్యాయులకు అందిస్తున్న సేవలకు, పి ఆర్ టి యూ టి ఎస్ పటిష్టతకు తనదైన శైలిలో కృషి చేస్తున్న అశ్విని చంద్ర శేఖర్ సేవలను గుర్తించి అధిష్టానం మరో సారి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా అవకాశం కల్పించడం అభినందనీయం. *బాధ్యత యుతంగా పనిచేస్తా : అశ్విని చంద్ర శేఖర్* విద్యా, ఉపాధ్యాయ సమస్యల సాధనకై బాధ్యత యుతంగా పనిచేస్తానని పి ఆర్ టి యూ టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన అశ్విని చంద్ర శేఖర్ అన్నారు. అధిష్టానంపై తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అందు బాటులో ఉoటూ యునియన్ పటిష్టతకు శక్తి వంచన లేకుంగా కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఏక గ్రీవ ఎన్నికకు సంపూర్ణ సహాయ సహకారం అందించిన రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జి.మదన్ మోహన్ యాదవ్ , ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం అంజయ్య, రఘువర్ధన్ రెడ్డి లతో పాటు మండల, జిల్లా, రాష్ట్ర నాయకులకు ఈ సందర్భంగా అశ్విని చంద్ర శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: