కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నాయని వాసవి క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు అన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని ఎన్ విలేజ్ హోటల్లో వాసవి క్లబ్ గోల్డెన్ స్టార్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. క్లబ్ గవర్నర్ సూరిశెట్టి నరసింహ నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షునిగా వీరభద్రరావు కార్యదర్శిగా రవీందర్ కోశాధికారిగా ఆనంద కుమారులు ప్రమాణ స్వీకరణ చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరు రమేష్ బాబు మాట్లాడారు గోల్డెన్ స్టార్ క్లబ్ ద్వారా2017 నుండి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించడం అభినందనీయం అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూలూరు రఘు, కల్మిచెర్ల రమేష్, బెజుగం రమేష్, వడకట్టు విజయ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News