కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తి లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అరవరోజు అమ్మవారు బాలాత్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. *బాలా త్రిపురసుందరి* *త్రిపురేశ్యైచ విద్మహే* *కామేశ్వర్యై చ ధీమహి* *తన్నోబాలా ప్రచోదయాత్.* అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. దేవాలయంలో ఉదయం అమ్మవారి సుప్రభాతం, అభిషేకం, ప్రాతః కాల పూజలతో మొదలుకొని రెండు పర్యాయాలు సామూహిక కుంకుమార్చనలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా,లలితా సహస్ర నామాలు పఠించడం జరిగింది. అనంతరం శ్రీ శివానంద స్వామి వారు పీఠాధిపతులు- సద్గురు శ్రీ నిత్యశుద్ధానంద స్వామి క్షేత్రము, శ్రీ రామదూత ఆశ్రమం,ఆమనగల్లు వారిచే ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి వారు చాలా అద్భుతంగా వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వాసవి క్లబ్స్ వారిచే వెల్ బేబీ షో ఏర్పాటు చేసి చిన్నారులకు బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. నవకన్యల పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మహా మంగళ హారతి తీర్థప్రసాద వితరణ, విచ్చేసిన భక్తులకు భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం శివానంద స్వామి వారిచే క్విజ్ పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు, మహిళలచె దాండియా, కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు వాసవి క్లబ్ అద్యక్షులు చిదిరె శ్రీనివాస్ ,ప్రధాన కార్యదర్శి కల్వ ఆంజనేయులు , కోశాధికారి దుగ్గి అశోక్ , ఆర్యవైశ్య సంఘం , అవోప మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News