కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గురువారం 4 వ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అని,ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దంపతలచే సామూహిక కుంకుమార్చన, సహస్ర నామ పారాయణంలు, చిన్నారులకు మెజీషయన్ ఆటల పోటీలు నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా దుస్తులు, అలంకారం తో దేవాలయానికి వచ్చిన మహిళల ను లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి రాచురు రాంమోహన్ సహకారంతో బహుమతులు అందజేశాయడం జరిగింది అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి లు తెలిపారు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం చైర్మన్ రమేష్ బాబు, మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాతల సహకారంతో, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించు కుంటున్నాం అని అన్నారు.ఆనతరం రామకృష్ణ ను, జిల్లా కమిటీ సభ్యులను దేవాలయం చైర్మన్, ఉత్సవ కమిటీ శాలువా సన్మానం చేశారు.ఆనతరం పెద్ద మంగళ హారతి,దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని,ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలలో యువత కీలక భూమిక పొషించడం జరిగింది అని రమేష్ బాబు తెలిపారు. సాయంత్రం సాంసృతిక కార్యక్రమలు ఉంటాయి అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె, కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు, మహిలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News