కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / కల్వకుర్తి : వాసవి క్లబ్, మరియు వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం లో శ్రావణమాసం లో భాగంగా శుక్రవారం ఊరేగింపు తో జై వాసవి నినాదాలతో సరే-చీర మరియు అమ్మవారికి వొడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు గారు హాజరై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గొప్పతనం గురించి మాట్లాడారు. ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ప్రతి క్లబ్ కు చీరలు పంపించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్స్ బాదం ధనలక్ష్మి రాఘవేందర్, సెక్రటరీ నీల స్రవంతి, కోటీశ్వర్, ట్రెజరర్స్ మచిపెద్ది కల్పన రవి కుమార్, మండల్ ప్రెసిడెంట్ గంధం ప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ వాస శేఖర్, చిగుళ్ళ పల్లి శ్రీధర్, యన్మంగండ్ల రవి, కల్వ ఆంజనేయులు, యూత్ అధ్యక్షులు సంబు తరుణ్, మహిళా అధ్యక్షులు మౌనిక, మరియు వాసవియన్స్ వనితలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Kalam Power News