కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం లో సోమవారం ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద ఉన్న లడ్డు, కండువాలు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్, ఆర్యవైశ్య మహాసభ సంఘం మండల, పట్టణ అధ్యక్షులు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్ సంఘం సభ్యులు ఆద్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పోటీ పడి వేలం పాటలో లడ్డు కండువాలు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అనుబంధ సంఘాల, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయంలో సోమ వారం జరిగిన గణేష్ నవరాత్రి లడ్డూ వేలం లో 1) మొదటి లడ్డు దక్కించుకున్న వారు కలిమిచెర్ల గోపాల్ 25116/- 2) రెండవ లడ్డూ దక్కించుకున్న వారు గంధం కిరణ్ ప్రసాద్ 25116/- 3) వినాయకుడి కండువా దక్కించుకున్న వారు బాదం రఘు 11,116/- 4) వినాయకుడి శాలువ మాచిపెద్ది వజ్రలింగం 11,116/- లకు దక్కించుకున్నారు.
Admin
Kalam Power News