Friday, 19 June 2026 01:54:05 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలి జిల్లా ఎస్పీ డి.జానకి

Date : 15 September 2024 06:15 PM Views : 918

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలని జిల్లా వాసులందరికీ ఎస్పీ డి.జానకి ఆదేశాలు జారీ చేశారు. గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలకు మరియు కమిటీ సభ్యులకు మరియు ప్రజలకు తెలియజేయడం ఏమనగా గణేష్ నిమజ్జనం దృష్ట్యా, శోభయాత్ర నిర్వహించువారు ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలి. --- శోభయాత్రలో DJ సౌండ్ BOX లను ఉపయోగించరాదు. ఇలా ఉపయోగించిన సౌండ్ బాక్స్లను సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును. --- శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు మరియు కమిటీ సభ్యులు బాధ్యత వహించవలెను. --- విద్యుత్ తీగలను మరియు వచ్చే పోయే వాహనాలను గమనించుకుంటూ యాత్రను. నిర్వహించవలెను. - శోభా యాత్రలో అశ్లీల నృత్యాలు గానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను గాని అట్టి పాటల్ని గాని ప్రదర్శించరాదు. - శోభా యాత్రలో బాణాసంచా కాల్చుట పూర్తిగా నిషేధము, ఇట్టి విషయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. - నిమజ్జనం సమయంలో నీటి వద్ద తగు జాగ్రత్తలు పాటించవలెను మరియు నీటి వద్దకు చిన్న పిల్లలను రానీయకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం చేయవలెను. - రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడంవంటివి చేయరాదు. - కనులపండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదు. - ప్రతి విగ్రహం నిమర్జనం వీలైనంత త్వరగా బయలుదేరాలని, వాహనాలపై పరిమితికి మించి భక్తులు వెళ్లకూడదు. - నిమజ్జన రూట్లలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బందికి అందరూ సహకరించగలరు. - ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్లో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతోంది., ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగిందని ఈ సి.సి టివిలు 24×7 ప్రకారంగా పూర్తిగా సిబ్బంది పర్యవేక్షణలో వుంటాయి. - నిమజ్జన సమయమున ఏమైనా ఇబ్బందులు తలెత్తినా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712658360 కి గానీ 100 కి గానీ సంప్రదించగలరు. - నిమజ్జనం రోజు ఆయా రూట్లలో విద్యుత్‌ శాఖ, ఆర్‌ అండ్‌బీ శాఖల మరియు ఇతర అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా భద్రతాపరమైన పూర్తి ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: