కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుదామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు. 21.10.2024 నుండి 31.10.2024 వరకు పోలీస్ అమరవీరుల స్మరించుకుంటూ *పోలీస్ ఫ్లాగ్ డే* ను నిర్వహిస్తున్నట్లుగా ఎస్పి ప్రకటించారు. ఈ పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని తోలిరోజైన సోమ వారం పోలీస్ కవాతు మైదానము నందు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించబడుతుందని, ఈ సందర్భంగా సోమ వారం ఉదయం 7 గంటలకు జిల్లా పోలీసు కవాతు మైదానము నందు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద వివిధ సంఘటనల్లో నక్సలైట్ల చేతుల్లో అమరులైన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు *శోక్ శ్రస్త్* పరేడ్ నిర్వహించబడుతందని, ఈ కార్యక్రమములో జోగులాంబ జోన్ డిఐజి ఎల్.ఎస్.చౌహన్, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా మరియు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత అధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు హజరయి అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో హజరయి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు రావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
Admin
Kalam Power News