కలం పవర్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రోజు తెల్లావరుజామున కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వాహనాన్ని నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం....
కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి* పటాన్ చెరువు సుల్తాన్పూర్ దగ్గర orr పై ప్రమాదం... ఘటన స్థలంలోనే ఎమ్మెల్యే లాస్య మృతి.. పిఏ డ్రైవర్లకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు.. అతివేగం నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ.. ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం... సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పిన ఎమ్మెల్యే కారు... సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో లాస్య నందిత మృతి... లాస్య నందిత దివంగత నేత సాయన్న కూతురు.. ఏడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో సాయన్న మృతి... ఏడాదికే సాయన్న అతని కుమార్తె లాస్య మృతి... ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య... నల్గొండ సభకు హాజరైన సమయంలో లాస్య నందిత కారుకు ఇటీవలే మొదటిసారి ప్రమాదం.. రెండోసారి లిఫ్టులో మూడు గంటలు ఇరుక్కొని ప్రమాదం నుంచి బయటపడ్డ లాస్య.. మూడోసారి జరిగిన ప్రమాదంలో విధి నుండి మృత్యువు తప్పించుకోలేక మృతి
Admin
Kalam Power News