కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణ మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం... ఆద్వర్యంలో అమావాస్య బోజన ప్రసాద వితరణ... పట్టణంలోని ఆర్టీసీ బస్సు స్టాండ్ ఆవరణలో ఆదివారం ఆర్యవైశ్య మహా సభ పట్టణ మండల సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ కొబ్బరి కాయ కొట్టి వాసవి కన్యకాపరమేశ్వరి దేవికి పూజలు నిర్వహించి అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన తోపాటు పట్టణ, మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం అధ్యక్షులు వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్ లు మాట్లాడుతూ ప్రతి నెల దాతల సహకారంతో ప్రతి అమావాస్య రోజున బోజన ప్రసాదాలు వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాతల అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ లాంటి సేవా కార్యక్రమాలు ఆర్యవైశ్యుల అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సూమరు 300 మందికి అన్న ప్రసాదం పంపిణీ చెయ్యడం జరిగింది అమావాస్య టీం సభ్యులు గార్లపాటి శ్రీనివాసులు,సంబు ముత్యాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యు సంఘం, అనుబంధ సంఘాల నాయకులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, రికార్డ్ గ్రేటర్ అసోసియేషన్, కిరణం అసోసియేషన్ పట్టణ, మండల సంఘం, వాసవి క్లబ్ ఆవోప, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News