కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నారు శనివారం రెండవ రోజు నాగర్ కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జూలూరు రమేష్ బాబు ముఖ్యఅతిథిగా యాగానికి హాజరయ్యారు ఈ సందర్భంగా యాగం నిర్వహించే నిర్వాహకులతో పాటు కల్వకుర్తి పట్టణానికి చెందిన ముగ్గురు బ్రాహ్మణులను రమేష్ బాబు, యాగ నిర్వాహకులు సోమిషెట్టీ నాగరాజులు శాలువాతో సత్కరించారు శనివారం వేద పండితులు మహాలక్ష్మి యాగం నిర్వహించారు ఆదివారం 108 హోమగుండాలలో హోమం 4 గంటల పాటు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జూలూరు రమేష్ బాబు మాట్లాడుతూ యాగఫలం అందరికీ దక్కాలి అన్నారు ఈ కార్యక్రమంలో, జూలూరి ప్రకాష్, అప్పాయి పల్లి శ్రీనివాస్, గంధం ప్రసాద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు ప్రవీణ్, కృష్ణయ్య , వీరేశ్, యాగ నిర్వాహకులు అశోక్ , రాఘవేందర్,రవి, రామ్ మోహన్ , వెంకటేష్ పాల్గొన్నారు.
Admin
Kalam Power News