కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గత పది రోజులుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం చివరి రోజు అంగరంగ వైభవంగా అమ్మవారి శోభా యాత్ర ఊరేగింపు మెళతాలాలతో మహిళల దాండియా కోలటలతో, యువకుల ఆటపాటలతో, బాణసంచా కాలుస్తూ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి కుంభం, ఖడ్గలు, అనంతరం అమ్మవారి వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను వేలం పాట నిర్వహించారు. 82 116 రుపయలకు ఇప్పపాడు బాలస్వామి దక్కించుకున్నారు. దెవలయం చైర్మన్, ఉత్సవ కమిటీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అమ్మవారిని 10 రోజులపాటు వివిధ రూపాల్లో అలంకరించి అమ్మవారిని చీరలను వేలం పాట నిర్వహించారు ఈ వేలం పాటలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటి పడి చీరలను దక్కించుకున్నారు. ప్రధాన కూడళ్లు ద్వారా శోభా యాత్ర ఊరేగింపు కొనసాగింది. నరసింహ స్వామి , హిరణ్య కశిపుడు పాత్రలు అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం ఎల్లికల్ రోడ్డు లోని శ్రీనివాస్ రికార్డు గ్రేటర్ ఇండస్ట్రీలో అమ్మవారి అబృవత స్నానం తో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా దాతలను బహుమతులతో శాలువా కప్పి ఘనంగా సన్మానించిడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రేవంత్, డి నితిన్, కోశాధికారి లు పోల గిరిబాబు, సంబ తరుణ్, ఉత్సవ కమిటీ సలహాదారులు వాస శేఖర్ తదితరులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News