కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గత 6 రోజులు గా అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళ సంఘం ఆధ్వర్యంలో 108 మంది మహిళలచే ఏర్పాటు చేసిన మణిద్వీప వర్ణన పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందగా ఎమ్మెల్యేకు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి కమిటీ సభ్యులు, సంఘం నాయకులు పూర్ణ కుంభం, సన్నాయి మేళం తో స్వాగతం పలికారు. దేవాలయం లో ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయం అని ఈ ఉత్సవాలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆనతరం ఎమ్మెల్యే ను, బాలాజీ సింగ్, ఆనంద్ కుమార్ విజయ్ కుమార్ తదితరులను దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆనతరం బోజన ప్రసాదాలు తీసుకున్నారు, ఆదే విధంగా భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కే గోవర్దన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News