కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున వైభవంగా వాసవి మాత జన్మదినోత్సవ వేడుకలు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ ఆద్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, పూజలు , గీతా, వాసవి మాత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణము, అమ్మవారి పల్లకి సేవ, మహిళలచే సామూహిక కుంకుమార్చన, అమ్మవారి డోలరహణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలలు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు అనంతరం మంగళహారతి, అనంతరం తీర్థ ప్రసాదాలు బోజన ప్రసాదాలు వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ , మండల సంఘం నాయకులు అనుబంధ సంఘాలు వాసవి క్లబ్,ఆవోప, మహిళా సంఘం నాయకులు, నాయకురాలు, మహిళలలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News