కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : చేనేత కార్మికుల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించి వారి సంక్షేమం గురించి ఆలోచించి చేనేత కార్మికుల కొరకు..... తెలంగాణ చేనేత అభయహస్తం పథకం.... అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ జీవో జారీ చేశారు. ఈనెల 10న తెలంగాణ చేనేత అభయ హస్తం పథకం అమలుకు విధివిధానాలను ఖరారు చేసి.1.. నేతన్న పొదుపు.. ట్రిప్టు ఫండ్ .. 2.. నేతన్నకు భద్రత... చేనేత భీమా... 3... నేతన్న భరోసా పథకాలకు జీవో జారీ చేశారు. ఈ సందర్భంగాTPCC చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్ని నాగరాజు మాట్లాడుతూ చేనేత కార్మికుల విషయంపై అన్ని విధాలుగా సహకరిస్తూ చేనేత కార్మికుల స్థితిగతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మాకు సహకరించిన గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య కు చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ 9వ వార్డ్ కౌన్సిలర్ సంబారి శ్రీమన్నారాయణ చేనేత కార్మికులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేనేత కార్మికుల తరఫున పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ సంభారి శ్రీమన్నారాయణ , రాష్ట్ర ముఖ్యమంత్రికి చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో సురేందర్ పోతు భీమేష్ కంచే శేఖర్ తిరుమల మునీశ్వర్ భీమనపల్లి రఘు బావుండ్ల వెంకటేష్ సుకూర్ శివరాజు పులిపాటి శ్రీను సిరిశాల రాములు పగడాకుల గోపాల్ రవి నీలి శంకర్ మేడం రమేష్ నీలి కృష్ణంరాజు భీంపల్లి రవీందర్ గోరంట్ల నరసింహులు కొంకతి లక్ష్మీనారాయణ మహిళలు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Admin
Kalam Power News