కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయము కల్వకుర్తి గత 35 సంవత్సరములుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2024 శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అధ్యక్షున్ని ఎన్నుకోవడం కొరకై వాసవికన్యకాపరమేశ్వరి దేవి దేవస్థాన చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గంప శ్రీనివాసులు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శివ్వ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి చిగుళ్ళపల్లి శ్రీధర్, పూర్వ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాసులు, వాస శేఖర్ సభ్యులు గంధం ప్రసాద్, సంబు ముత్యాలు, బచ్చు మోహన్ బాబు, గందే రవి, వాసవి క్లబ్ అధ్యక్షుడు చిదిరె శ్రీనివాసులు, కంది ప్రవీణ్, కొండూరు కృష్ణయ్య మరియు ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News