కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / కల్వకుర్తి : కల్వకుర్తి... పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, అభిషేకాలు, వాసవి మాత పారాయణం, పల్లకీ సేవ, సామూహిక కుంకుమార్చన, హోమం అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమాలు నిర్వహించారు, ఆదే విధంగా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు బోజన ప్రసాదాలు అందజేశం అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గంప శ్రీనివాసులు జిల్లా సంఘం అధనపు కార్యదర్శి చిగుళ్ళుపల్లి శ్రీధర్,వాసవి క్లబ్ అధ్యక్షుడు బాదం రాఘవేందర్, ఆర్యవైశ్య సంఘం,అవోప, వాసవి క్లబ్ అనుబంధ సంఘాలు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు మౌనిక, యువజన సంఘం అధ్యక్షుడు తరుణ్ సంఘాల నాయకులు,మహిళలలు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని రమేష్ బాబు తెలిపారు.
Admin
Kalam Power News