కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : రాజాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ సంఘం పీ అర్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభా గల ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య బోధన అందుతుందని అన్నారు. పారిశ్రామికవేతలందరినీ జడ్చర్ల నియోజకవర్గానికి పిలిపించి ప్రతి ఒక్కరికి ఒక స్కూల్ ను అప్పగించి అభివృద్ధి చేయాలని సూచిస్తానని అన్నారు. ఎమ్మెల్యే సొంత నిధులతో పాఠశాలలో మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల బోధనలను సక్రమంగా అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.
Admin
Kalam Power News