కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఎవరికి వచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ గెలుపే లక్ష్యం గా పని చేస్తామని సి డబ్ల్యూ సి మెంబర్ చల్లా వంశీ చంద్ రెడ్డి అన్నారు. గురువారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రం లోని 17 లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ని పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి ప్రతినిధుల సమీక్షా సమావేశం మహబూబ్ నగర్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో వంశీ చంద్ రెడ్డి తోపాటు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ..రాష్ట్రం లోని 17 పార్లమెంట్ నియోజకవర్గంలకు సంబందించిన భవిష్యత్తు కార్యక్రమం గురించి చర్చించామని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను బలోపేతం చేయడానికి తీసుకోవలసిన నిర్ణయాలను చర్చించామని తెలిపారు. ఇప్పటివరకు ప్రతి కాంగ్రెస్ సైనికుడు గత ప్రభుత్వ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పని చేయడం జరిగిందన్నారు.ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు ప్రజలకు అందేలా చేయడం కాంగ్రెస్ సైనికుల తక్షణ విది అన్నారు. రాష్ట్రం లోని ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి గడపకు కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా యువజన కాంగ్రెస్ ప్రతినిధులు కృషి చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ భావజాలం నర నరాన నింపుకున్న కాంగ్రెస్ సైనికులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో న్యాయ్ యాత్ర సిద్ధాంతాలు, ఉద్దేశ్యాలు ప్రజలకు వివరించాలని ప్రతినిధులకు సూచించారు. రానున్న పది పదిహేను రోజుల్లో మళ్ళీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని రెండు పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజార్టీ తో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Admin
Kalam Power News