కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : పాలమూరు బీ ఆర్ యస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు విరసనోళ్ల శ్రీకాంత్ గౌడ్ మాజీ పి ఆర్ టి యు అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు వెంకటరామిరెడ్డి పై చేసిన దాడిని ఖండిస్తూ శని వారం రాత్రి రూలర్ పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. వీ వాంట్ జస్టిస్, కలెక్టర్ రావాలి, శ్రీకాంత్ గౌడ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ .. భారీ ఎత్తున నినాదాలు చేస్తూ రూరల్ పోలిస్ స్టేషన్ ప్రాంతం దద్దరిల్లెలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ అనుచరులతో జిల్లా కేంద్రం లోని శ్రీనివాస కాలనీలో శనివారం సాయంత్రం ఆ నలుగురు.? .వెంకటరామిరెడ్డి పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ రూలర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమకు వెంటనే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
Admin
Kalam Power News