కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాలను డిఐఇఓ వెంకటరమణ బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సిలబస్ గురించి ,టీచింగ్ డైరీస్, అటెండెన్స్ రిజిస్టర్స్ ను క్షుణంగా పరిశీలించారు. ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల చక్కటి అభివృద్ధి జరుగుతున్నదని అధ్యాపకులు టీమ్ వర్క్ తో సమర్ధవంతంగా పని చేసుకుంటూ జిల్లా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించడం జరిగిందని కొనియాడారు .ఈ జిల్లాలోనే బ్రాండ్ ఇమేజ్ నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరగబోయే ఇంటర్ ఎగ్జామ్స్ లో 100% రిజల్ట్స్ తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి లెక్చరర్స్ వేణయ్య, సదానందంగౌడు, మల్లేష్, నయూమ్, భీమేష్, రాజేష్, పరశురాం, శ్రీనివాస్, బాలరాజ్, లక్ష్మి కాంత్, లక్ష్మయ్య, సంతోష్ గౌడ్ పాల్గొన్నారు.
Reporter
Kalam Power News