Tuesday, 21 April 2026 03:20:56 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

మొదటిరోజే దివ్యాంగురాలిని మోసం చేసిన కాంగ్రెస్ మిథున్ రెడ్డి

Date : 10 December 2023 08:08 PM Views : 607

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పాలన ప్రారంభించిన మొదటి రోజునే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒప్పంద ఉద్యోగం ఇచ్చి తనను అవమానించారని ఆముదాలపాడు మిథున్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి భవన్ కంచెలు తీసేసి ప్రజల సమస్యలు తీరుస్తానని ఒక్క సమస్య కూడా పరిష్కరించ లేదన్నారు. ఆర్టీసి ఇప్పటికే నష్టాల్లో ఉండగా ఉచిత హామీ వల్ల రోజు కోట్లల్లో నష్టం భరించాల్సి వస్తుందని, గత ఓ యస్ డి లు పైల్లు ఎత్తుకెళ్తుంటే ప్రభుత్వం చేస్టలుడిగి చూస్తోంది అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలోని కేసులే కాకుండా భారాస అక్రమాలను ప్రశ్నించిన వారి పై బనాయించిన అక్రమ కేసులు కూడా ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. గత పాలకులచే కబ్జా కాబడ్డ ప్రభుత్వ, ప్రైవేటు భూములను వారి కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించాలన్నారు. డబుల్ బెడ్ రూముల అక్రమాల విషయంలో ప్రత్యేక అధికారినీ నియమించి విచారణ చేపట్టాలని కోరారు. వారం రోజుల్లో జరిగిన అక్రమాలపై ఏమ్మెల్యే విచారణ ప్రారంభించక పోతే భాజపా పోరుబాట పట్టాల్సి వస్తుంది హెచ్చరించారు. గత ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్లే ప్రజానీకం మార్పును ఆహ్వానించారు. ఆరు గ్యారెన్టీ లను ఏ విధంగా అమలు పరుస్తారో స్పష్టం చేయాలన్నారు. ఆర్టీసీ నీ ఏ విధంగా సంరక్షిస్తారో ప్రజలకు వివరించాలని కోరారు. గత పాలక వర్గ విధానాలను వ్యతిరేకించిన వారిపై నమోదైన కేసులను వెంటనే ఎత్తి వేయాలన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా భాజపా మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, మంచి చేస్తే ప్రశంశిస్తామన్నారు. ఎవరికి ఏ సమస్యా వచ్చిన పద్మావతి కాలనీ లో గల తన కార్యాలయం 24 గంటలపాటు సంప్రదించ వచ్చునని వారి సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా పోరాటం చేస్తానన్నారు. ఫోన్ నంబరు 9989040123 కూడా ప్రజలు ఎప్పుడు సంప్రదించిన అందుబాటులో ఉంటానన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి. పడాకుల బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి .పి సత్యం, బుచ్చిరెడ్డి అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య, ఓబిసి మచ్చ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కే సతీష్ కుమార్, పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు రాజు గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :