కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : నియోజక వర్గం, మాడుగుల మండల పరిధిలోని అవురుపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి సమయంలో బహుజన వీరుడు గోల్కొండ చక్రవర్తి శ్రీ సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం ధ్వంసం చేశారు. ఇది పిరికిపందల చర్య అని దుండగుల్ని తక్షణమే అరెస్టు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన దుండగులు ఎంతటివారైనా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బహుజనుల ఆత్మగౌరవం దెబ్బకొట్టేలా వ్యవహారిస్తే సహించబోమని కల్వకుర్తి తాలూకా గౌడ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. పాపన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని గౌడ యువజన సంఘం అధ్యక్షులు రుక్కులు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడు, కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ కార్వంగ శ్రీనివాస్ గౌడ్, గౌడ యువజన సంఘం కోషాధికారి కొమ్మ గోని రవి గౌడ్, చేదుర్ పల్లి వెంకటయ్య గౌడ్, దామోదర్ గౌడ్, ఆనంద్ గౌడ్, పాండు గౌడ్, నరేష్ గౌడ్, సురేష్ గౌడ్, రాజుగౌడు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News