కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఏమి.. అధికారులు మాకు అండగా ఉండగా మా దందాలు యధేచ్ఛగా కొన సాగిస్తామంటూ.. మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. పంట పొలాల్లోని మట్టిని జేసిబి యంత్రాలతో త్రవ్వి ట్రాక్టర్లలో నింపి బోరు మోటార్ల ద్వారా ఆ మట్టిని కడిగి ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్నారు. ఈతతంగమంతా రాత్రి పగలు అని తేడా లేకుండా యదేచ్చగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉన్నత అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక మాముల్ల పర్వం కొనసాగుతుండడంతో ఇటువైపు కన్నెత్తి చూడడానికి కూడా రెవెన్యూ పోలీస్ సిబ్బంది ముందుకు రావడం లేదనేది ప్రధాన ఆరోపణ. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామ శివారు నుంచి వెంకటేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అనే రైతులు తమ పంట పొలంలో రాత్రి పగలు అని తేడా లేకుండా మట్టిని కడిగి ఇసుకను చేస్తూ అధికారుల అండదండలతో యధేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగిస్తున్నారని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. ఇంటి నిర్మాణాలకు ఈ ఇసుకను వాడినా నాణ్యత లేని కట్టడాలు తయారవుతాయని చేసేది లేక కొంతమంది కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ వంటి నిర్మాణాలకు ఈ ఫిల్టర్ ఇసుకను ఉపయోగిస్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రంలో రెవిన్యూ పోలీసు ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ పక్కనే ఇంత తతంగం నడుస్తున్న ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరి కదా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాఫియాకు అడుగులకు మడుగులోత్తిన విధంగా కాకుండా ఫిల్టర్ ఇసుక మాఫియా పై కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా గట్టి చర్యలు తీసుకొని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. https://youtu.be/RbaZFg16xUw?si=nnhQ3zA0TQkmHykz
Admin
Kalam Power News