కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : క్లాస్ మేట్ క్లబ్ ఆధ్వర్యంలో జీకే టెస్ట్ జిల్లా పరిధిలో విజయవంతంగా జరిగింది .క్లాస్ మేట్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి జీకే టెస్టును ఊరుకొండ మండల ఎంపిహెచ్ఎస్ పాఠశాల నందు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు క్లాస్ మేట్ క్లబ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలిమిచెర్ల రమేష్ బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి పోటీ పరీక్షలలో పాల్గొని తమ తెలివిని పెంపొందించుకోవాలన్నారు తల్లిదండ్రులు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో క్లాస్ మెట్ క్లబ్ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసింహారావు, సభ్యులు చంద్రశేఖర్, స్థానిక ఎంపిహెచ్ఎస్ హెడ్మాస్టర్ బాలయ్య , ఉపాధ్యాయులు ప్రదీప్, మహేష్ ,రాధిక, పరంధాములు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News