Friday, 16 January 2026 07:43:23 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

కల్వకుర్తి లో వడ్ల కుంభకోణం..!!- ఇతర రాష్ట్రాలకు సీఎంఆర్ వడ్ల అమ్మకాలు.? - ధాన్యం ధరలు పెరగడంతో కస్టమ్ మిల్లింగ్ రైస్ వడ్లను అమ్ముకుంటున్న మిల్లర్స్.

ప్రభుత్వానికి పంపని సిఎంఆర్ మిల్లులలో నిల్వలు ఉన్నాయా..? మిల్లర్ల మాయాజాలం ..! https://youtube.com/shorts/WUI0NEh2WDE?si=argrzA1txKIHM6PL

Date : 29 December 2023 05:47 PM Views : 1586

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : మిల్లర్లు మాయాజాలం చూపిస్తున్నారు.. కల్వకుర్తి నియోజకవర్గంలో కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన సి ఎం ఆర్ ను సివిల్ సప్లయ్ కి తిరిగి చెల్లించకుండా కాసుల కక్కుర్తితో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బియ్యం మాఫియాకు కేంద్ర బిందువుగా పేరుగాంచిన కల్వకుర్తిలో మిల్లర్లు గత కొంతకాలంగా కొత్త కుంభకోణానికి తెరలేపారు. వడ్ల ధరలు అధికంగా పెరగడంతో కస్టమ్ మిల్లింగ్ కింద తమకు కేటాయించిన వడ్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర వ్యాపారాలు చేసి అప్పుల్లో కురుకుపోయిన వారు సైతం లాభసాటి గా మారిన రైస్ మిల్ బిజినెస్ ను ఎంచుకుని ముత పడ్డ మిల్లులను సైతం లిజుకి తీసుకోవడం తో పాటు 2022-2023 సంవత్సర కాలంలో కల్వకుర్తి చుట్టుపక్కల ప్రాంతాలలో కొత్తగా పలు రైస్ మిల్లుల నిర్మాణాలు చేపట్టారు. అందినకాడికి తిందామని యోచనలో వున్న అధికారుల చేతివాటంతో మిల్లుల నిర్మాణం పూర్తి కాకముందే విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వక ముందే మన నాగర్ కర్నూల్ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు పెద్ద మనసు చేసుకొని పలు మిల్లులకు వరి ధాన్యాన్ని కేటాయించారు. అందులో భాగంగానే సంజాపూర్ దగ్గర ఓ మిల్లు రోడ్డ్ వైన్డింగ్ లో పోతుండగా.. ప్రభుత్వం తరపున ఆ మిల్లు యజమానుల కు భారీగానే నష్టపరిహారము అందుకొన్నారు. అంతటితో దన ధాహం తీరని దళారులు సిఎంఆర్ కింద ఇచ్చిన ప్యాడిని అమ్మేసుకున్నారు. ప్రభుత్వానికి పంపాల్సిన బియ్యాన్ని మాత్రం పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ మిల్లుకు రైతులు తెచ్చే వడ్లను మాత్రం బియ్యంగా మారుస్తూ వారి పనులు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి సీఎంఆర్ చెల్లించకుండా మిల్లర్లు మీన వేషాలు వేస్తూ జాప్యం చేస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తూనే ఉండిపోతున్నారు. పట్టణ పరిధిలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లర్లు సీఎంఆర్ కింద వడ్లు తీసుకోని మొత్తం ఇతర రాష్ట్రాలకు తరలిస్తు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ కొత్త కుంభకోణానికి తెరలెపారు. ఇదే లాభదాయకమని ఒక్కో వ్యాపారస్తుడు రెండు, మూడు, స్వంతంగా నాలుగు మిల్లుల వరకు నిర్మాణలు చేపడుతూ ప్రభుత్వం నుండి ప్యాడి ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా పని చేస్తున్నారని కొందరు పిర్యాదు నిమిత్తం ఫోన్ చేస్తే ఏత్తకుండా తప్పించుకుంటున్నారు అని పిర్యాదు దారులు పేర్కొనడం గమనార్హం. -ప్రభుత్వానికి పంపని.. సిఎంఆర్ మిల్లులో నిల్వలు ఉన్నాయా..? లేవా..!! సీఎంఆర్ చెల్లింపులలో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతున్నప్పటికీ అధికారులు కనీసం ఒక్క మిల్లునైనా తనిఖీ చేసిన పాపాన పోలేదని సీఎం ఆర్ కోసం ఇచ్చిన వడ్లు మిల్లులలో, గోదాములలో ఉన్నాయా..? లేవా..? అనే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు శృతిమించి పోతున్నారు. ప్రభుత్వానికి సకాలంలో చెల్లించకుండా తమ దగ్గర ఉన్న వడ్లను అమ్ముకొని లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వున్న నేపద్యంలో ఇప్పటికైనా సివిల్ సప్లై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ సి ఎం ఆర్ సప్లయ్ విషయంలొ దృష్టి సారించి మిల్లర్ల పై కఠినంగా వ్యవహరించి సివిల్ సప్లై లో జరిగే కోట్ల రూపాయల కుంభకోణాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :