కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా స్వేచ్ఛ లేకుండా ప్రజలను హింసిస్తే ప్రజాక్షేత్రంలో ఎంతటివారికైనా ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని పెద్దమందడి టీఎంఆర్ యువసేన సభ్యులు మనిగిల్ల శివ యాదవ్ అన్నారు. గతంలో తాను వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును ఫార్వార్డ్ చేయడం వల్ల తనను చిత్రహింసలకు గురి చేశారని, కొత్తకోట సీఐ అస్త్రంగా ఉపయోగించుకుని తన అధికారమధంతో విచ్చలవిడిగా దాడి చేయించి తనను తీవ్రంగా గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల శాపనార్థాలు తగిలి మంత్రి ఘోరంగా ఓటమిపాలయ్యారని ఆయన అన్నారు.
Reporter
Kalam Power News