Tuesday, 21 April 2026 03:26:37 PM
# క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

క్రమశిక్షణకు మారుపేరు బిజెపి కార్యకర్తలు..! - నాయకులకు వర్తించదా..?

- పార్టీ విధానం ఏం చెబుతోంది.. - పార్టి విలువలకు తిలోదకాలిచ్చిన వారిపై చర్యలు ఉండవా..! - సెకండ్ క్యాడర్ సెకండ్ క్యాడర్ గానే ఉండిపోవాల్సిందేనా..? - పా

Date : 11 January 2024 06:21 AM Views : 1083

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశంలోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరు బిజెపి కార్యకర్తలు జాతీయ రాష్ట్రస్థాయి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి పలు సందర్భాలలో పత్రికల ప్రకటనలో, మీటింగ్లలో నాయకులు చెబుతుంటారు.. కానీ వారు మాత్రం పార్టీ ప్రయోజనాలను పక్కకు పెట్టి వారి వారి స్వార్ద ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారనేది వాస్తవం. ఇచ్చిన వారికి అవకాశాలు ఇస్తూ ఓడిపోయిన వారికి మళ్ళీ అవకాశాలు ఇస్తూ ఎన్నికలవేళ గోడ మీద పిల్లుల్లా పార్టీలు మారిన వారిని అందలమెక్కిస్తూ పార్టీ భవితవాన్ని తుంగలో తొక్కుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల లో జడ్చర్ల నియోజక వర్గంలో పార్టీ కొసం అన్ని తానై పని చేసిన బాలా త్రిపుర సుందరికి టికెట్ ఇవ్వకుండానే అప్పుడే పార్టీలో చేరిన, మాజి మంత్రి జక్కుల చిత్తరంజన్ దాస్ కు టికెట్ కేటాయించడంతో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘోర పరాభవం పొంది డిపాజిట్ సైతం దక్కించుకోలేదు. ఎన్నికల ఫలితాల నాటి నుంచి నేటి వరకు మళ్లీ దాస్ సాబ్ జడ్చర్ల నియోజకవర్గంలో అడుగుపెట్టిన దాఖలాలు లేకుండా పోయాయి. దీంతో జడ్చర్ల నియోజక వర్గంలో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. అదేవిదంగా గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొంతమంది వారి వారి నియోజకవర్గాలలో పార్టీ బలోపేతంగా ఉన్నప్పటికీ ఓటింగ్ సరళి ప్రారంభం అయ్యే నాటికి లోపాధికారి ఒప్పందాలు చేసుకొని వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీ వాళ్లకు తమ మద్దతును అంతర్గతంగా ప్రకటించి అభ్యర్ధుల ఓటమికి కారణమై పార్టీ విలువలకు తిలోదకాలు ఇచ్చారనే విమర్శలతో కూడుకున్న ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా గద్వాల నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం బిజెపి పార్టీ తన ప్రచారాన్ని అంతంత మాత్రమే చేసిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి.? బండ్ల బంగ్లా రెండు కలిసిపోయాయని, కలిసిపోయి బోయ సరిత ఓటమికి పునాదులు పడ్డట్లు తెలుస్తోంది. పలు సర్వేల ప్రకారం బోయ సరిత గద్వాల నియోజకవర్గంలో గెలుపు ఖాయమని పోటీలో వున్న ప్రత్యర్థులు సైతం ఒప్పుకున్న పరిస్థితి నుంచి లోపాయకారి ఒప్పందాల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది.. అనేది ఒక వాదన..! కాగా యువ నాయకుని భవితవ్యాన్ని పక్కకు పెట్టీ చివరి నిమిషంలో లోపయికారికంగా పని చేశారని గద్వాల మాదిరిగానే పాలమూరులో సైతం ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. ప్రస్తుతం 2024 పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎంపీ సీటు కోసం ఆశావాహులు ఖర్చీప్ వేసుకుని గట్టిగానే కూర్చున్నారు. గతంలో అవకాశం వచ్చిన గెలువని వారు కొందరైతే అవకాశం వచ్చి గెలిచి మళ్ళీ పోటీలో నిలబడాలని ఆశించేవారు మరికొందరు ఉన్నారు అంతేకాకుండా పలుమార్లు టికెట్ ఆశించి భంగపడ్డ బండారి శాంతి కుమార్ కూడా ఎంపీ టికెట్ ఈసారి ఖచ్చితంగా తనకే వచ్చే విధంగా పావులు కదుపుతున్నారు. గతంలో పార్టీలు మారిన వారికి అధిష్టానం అవకాశం ఇచ్చి ఎన్నికల బరిలో నిలవాలన్న తన ఆశలపై నీళ్లు చల్లినప్పటికీ సైలెంట్ గా వుండి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసి పార్టి సంస్తగత విలువలను కాపాడారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలన్న పాలమూరు మోదీ కోరిక 2024 పార్లమెంట్ ఎన్నికల లో నైనా నెరవేరేనా..! అని పార్టి శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :