కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి జగన్ కాంగ్రెస్ అధిష్టానం తనకు అవకాశం ఇస్తే నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మల్లేపల్లి జగన్ అడ్వకేట్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లేపల్లి జగన్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు గౌరవం గుర్తింపు ప్రత్యేకత దక్కిందన్నారు. అవకాశాలు ఎన్ని వచ్చినా పార్టీ మారకుండా 2008 నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ లో క్రియాశీలకంగా కొనసాగుతున్నానని తెలిపారు. పదవుల కోసం ఎన్నడు పార్టీలు మారలేదని అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డ తనకు అధిష్టానం గుర్తించి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించాన్నాని, అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం వాసుదేవపూర్ గ్రామానికి చెందిన తాను కల్వకుర్తి లో స్థిరపడ్డానని గతంలో మామిడిపూడి ఫౌండేషన్ ద్వారా బాల కార్మికుల నిర్మూలన కోసం తన వంతుగా కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. అదిలాబాద్ జిల్లాలోని ఐ టీ డీ ఎ బోధ్, ఆసిఫాబాద్, అదిలాబాద్ నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలలో పేదరిక నిర్మూలన పథకం లో వెలుగు సి.సి, ఎపిఎం, డిపిఎం, ఏరియా కోఆర్డినేటర్ గా పనిచేశానన్నారు. అనంతరం కల్వకుర్తి బార్ అసోసియేషన్ లో పేరు నమోదు చేసుకొని న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు, తెలంగాణ ఉద్యమం లో, అనేకరకాల సామాజిక ఉద్యమాల్లో పనిచేశానని న్యాయవాదిగా చట్టాలపై అవగాహన ఉందని తనకు అవకాశం కల్పించాలని డిసిసి అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మండల నాయకులు నారాయణ వెంకటేష్, వెల్దండ ఓబీసీ సెల్ అధ్యక్షులు నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News