కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎనుమల రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం పట్ల జిల్లా కాంగ్రేస్ పార్టీ మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్ మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళుతుందన్నారు. రేవంత్ రెడ్డినీ సీఎంగా ప్రకటించినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతోపాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Kalam Power News