కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల జిల్లా కేంద్రంలోని గంజి పేట లో క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంజి పేట రాజు, గోపాల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకల్లో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా భాగంగా సెమి క్రిస్మస్ వేడుకలలో చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం చిన్నారుల నత్యం ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవ సోదరులందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలలోని ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ పండగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కౌన్సిలర్ నాగిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంగి సుదర్శన్, చంద్రశేఖర్, చంటి నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News