కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : వనపర్తి పట్టణంలో 7వ వార్డు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన్యం వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తూడి మెఘా రెడ్డి విజయం సాధిస్తే 108 కొబ్బరికాయలు చెల్లిస్తానని మొక్కుకోవడం జరిగిందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు పాల్గొన్నారు. తూడి మెఘా రెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మంగళవారం పీర్లగుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన్యం పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాము, కాంతు కుమార్, మహేష్, కార్తీక్, రవి, మన్నెంకొండ, వెంకటేష్, ఏర్పుల రాములు, వెంకటేష్, శివ, రాఘవేంద్ర, లక్ష్మికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News