కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణలో 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుస్తామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. శుక్ర వారం పార్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్లస్టర్స మావేశంలో అమిత్ షా పార్లమెంట్ స్థాయి నాయకులకు కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం మార్గదర్శనం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరిగితే మూడు రాష్ట్రాల్లో బిజెపి మెజారిటీ స్థానాలు గెలిచి అధికారాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ అవినీతి అరాచకాలను పారద్రోలాలని తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకతను నింపింది బిజెపి . ప్రాజెక్టుల్లో అవినీతి దళిత ,గిరిజన, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దానిపై అనేక ఉద్యమాలు బిజెపి చేసింది. బిజెపిపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను కాంగ్రెస్ వైపు మలుచుకొని అతి కష్టంగా గెలిచింది. దాంతో దేశాన్ని గెలిచిన విధంగా ఉప్పొంగి ఉప్పొంగి పోతున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే.. తెలంగాణలో అత్యధికంగా 10 నుంచి 12 ఎంపీ స్థానాలు బిజెపి గెలుచుకుంటుంది. పాలమూరు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు కూడా బిజెపి గెలుస్తుంది. భారీ మెజారిటీతో ఎంపి స్థానాలు గెలిచి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తాం. ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అవుతారు. ఈ పత్రిక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు .రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి పద్మజా రెడ్డి .శ్రీ వర్ధన్ రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి కె వి ఎల్ ఎన్ రాజు ఏపీ మిథున్ కుమార్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి. బంటు రమేష్ . అందే బాబయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News