కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : మూసాపేట మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బేతంచర్ల నుంచి జడ్చర్ల వెళుతున్న కోళ్ల దాన లారీ ఎ పి 21టి ఈ 2489 అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా అకస్మాత్తుగా లారీ అదుపుతప్పి బోల్తా పడింది, దీంతో డ్రైవర్ సత్యం క్లీనర్ సోమరాజులకు స్వల్ప గాయాలు కాగా వెంటనే స్పందించిన పోలీసులు ఎల్ అండ్ టి శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
Reporter
Kalam Power News