కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన బి ఎం సంతోష్ ను శుక్ర వారం ఎం.ఐ.ఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మున్న భాష కలిసి స్వాగతం తెలియ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గత ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి లక్ష రూపాయల మైనారిటీ లోన్, రైతుబంధు, షాదీ ఖానాల ఎర్పాటు విషయమై చర్చించారు. ప్రజల సమస్యలను త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపి త్వరలోనే ప్రజలకు రావాల్సిన ప్రతి ఫలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. వీరి వెంట ఎంఐఎం పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఇమాముద్దీన్ మండల అధ్యక్షులు ఎండి రఫీ అస్లాం తదితరులు పాల్గొన్నారు
Admin
Kalam Power News