కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ అన్నారు, గురువారం మండల కేంద్రంలోని సంకల మద్ది గ్రామంలో ప్రజా పాలనలో ఆయనతోపాటు తహసిల్దార్ బ్రహ్మం గౌడ్. నయాబ్ తాసిల్దార్ ఈ ఆంజనేయులు. ఎంపీడీవో కే స్వరూప. హాజరై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గడపగడపకు పథకాలను తప్పకుండా అందచేస్తామని చెప్పారు, ఈ కార్యక్రమానికి జోరుగా స్పందన వస్తుంది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంతోషి. మాజీ ఎంపిటిసి ఆంజనేయులు. తాజుద్దీన్. వాకిటి శ్రీనివాసులు. రత్నయ్య. జిల్లా ఎన్ ఎస్ యూ ఐ జనరల్ సెక్రటరీ కొమ్ము అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Kalam Power News