Tuesday, 03 March 2026 12:21:25 AM
# సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు # అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... అమ్మవారి శోభా యాత్ర..... మహిళలచే దాండియా, మహారాష్ట్ర బృందం చే డోల్ వాయిద్యం.... బాణసంచా కాలుస్తూ పెద్ద # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 8 రోజు సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు # శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి # కన్నుల పండుగగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు... # కల్వకుర్తి లో అంగరంగ వైభవంగా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు # మూడవ రోజు అన్న పూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు # శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # శ్రీ ధాన్య లక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం # దసరా ఉత్సవాల పుస్తకావిష్కరణ # శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఉత్సవ కమిటీ # దేవి శరన్నవరాత్రి ఉత్సవ కరపత్రాల ఆవిష్కరణ # ఘనంగా గణపయ్య నిమజ్జనం, లడ్డు కండువాలు వేలం పాట.. # నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా గందే రవి # సామాజిక సేవలో అగ్రగామిగా లయన్స్ క్లబ్ # వైభవంగా వరలక్ష్మి దేవి వ్రతాలు... - జై వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు జేజేలు # ఘనంగా అమ్మవారి వొడి బియ్యం - ఊరేగింపు

నాన్న నేనోస్తున్నా..! తండ్రి అంత్యక్రియలలో.. కన్ను మూసిన కూతురు..సునిత..!!

Date : 07 January 2024 07:39 PM Views : 1010

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : నాన్న నేనోస్తున్నా..! అంటూ.. తండ్రి అంత్యక్రియలలోనే.. కన్ను మూసింది ఓ కూతురు.. తండ్రి మరణాన్ని చూసి తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే కుప్పకూలి కూతురు కూడా మృతి చెందిన హృదయ విదారకరమైన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఆదివారం మహబుబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. కూతురికి తండ్రి అంటే ఎంతో ప్రేమ చిన్ననాటి నుంచి ఆ తండ్రి కూతుర్లకు ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమానురాగాలు వీళ్ళ ప్రేమను చూసిన విధి కి కుళ్ళు పుట్టిందేమో.. ఓర్చుకోలేక పోయింది అందుకేనేమో వారి మరణాన్ని కూడా ఒకేసారి లిఖించింది. జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన దామోదర్ (82) శనివారం రాత్రి అకాల మరణం చెందారు. దీంతో చిన్ననాటి నుంచి తన తండ్రి ప్రేమను తనకు మాత్రమే సొంతం చేసుకున్న కూతురు సునీత (52) తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆదివారం అంత్యక్రియల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబీకులు హుటాహుటిన జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే కూతురు సునీత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఒకరి అంత్యక్రియలో పాల్గొనడానికి వచ్చిన బంధువులు మరొకరి మరణాన్ని చూడడం పలువురి హృదయాలను కలచివేసింది. జడ్చర్ల పట్టణంలోని సాయి నగర్ నివాసం ఉంటున్న కూతురు సునీత నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. తండ్రి కూతుళ్ళ ప్రేమను తట్టుకోలేని విధి కూడా . వారి మరణాన్ని ఒకేసారి లిఖించిందేమో అన్నట్టుగా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. తండ్రి కూతుర్ల మరణ వార్త జడ్చర్ల పట్టణం వ్యాప్తంగా తెలియడంతో పలువురు విచారం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :