కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నాగర్ కర్నూల్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన జైత్రయాత్ర కొనసాగించింది. 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలలో గెలిచి తన సత్తాను చాటుకుంది. పాలమూరు జిల్లా వాసి సీఎం రేసులో వున్నడని తమ ప్రాంతం వాడే సీఎం అవుతాడు అన్న ధీమాతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా గెలిపించారు 14 సీట్లలో ఏకంగా 12 సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అయితే పాలమూరు నుంచి గెలిచిన యెన్నం శ్రీనివాసరెడ్డి, కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి గెలిచిన కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట నుంచి గెలిచిన డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణ మంత్రి పదవి రేసులో ఉన్నారు. కల్వకుర్తిలో కసిరెడ్డి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినప్పటికీ గత పది సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. సౌమ్యుడు , వివాదరహితుడు కావడం కూడా ఆయనకు అదనపు అర్హతలుగా చెప్పుకోవచ్చు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జాతీయ కార్యదర్శి చల్లా వంశీ చంద్ రెడ్డి అండదండలు కూడా కసిరెడ్డికి పుష్కలంగా ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయ అనుభవంతో పాటు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా వాసి కావడం కూడా ఆయనకు కలిసి వస్తోంది. గతంలో టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కల్వకుర్తి ప్రాంతానికి కృష్ణా సాగుజలాలు తీసుకురావడంలో రైతాంగానికి అండదండగా ఉంటూ కసిరెడ్డి నారాయణరెడ్డి విశేషమైన కృషి చేశారు. కల్వకుర్తి ప్రాంతానికి మంత్రి పదవి దక్కితే కల్వకుర్తి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Kalam Power News