కలం పవర్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : యూపీఏ ప్రభుత్వం హయాంలో సోనియాగాంధీ వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Admin
Kalam Power News