కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన బాలు (బాలరాజు) నూతన గృహప్రవేశ వేడుకకు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి పూజలో పాల్గొనీ తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తులతో కూర్చుని కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి ఎంపీపీ రఘు ప్రసాద్, అమ్మపల్లి సర్పంచ్ రమేష్ యాదవ్, వెల్టూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, చీకరు చెట్టు తండా సర్పంచ్ రాధాకృష్ణ, ముందరి తండా సర్పంచ్ జయంతి, పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్, నాయకులు పుట్టమోని నారాయణ, కొర్రపాటి సుదర్శన్, గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Kalam Power News