కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానానికి గాను సోమ వారం ఆర్డీవో అనిల్ కుమార్ ను మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు కోరారు. దోనూరు, కొత్తపల్లి ఎంపీటీసీలతో పాటు బీఆర్ ఎస్పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారితోపాటు ఆరు మంది ఎంపీటీసీ లు ఆర్డిఓ, జెడ్పిసీఈఓ కు నోటీసులు ఇచ్చారు. మొత్తం తొమ్మిది మంది ఎంపీటీసీలకు గాను 6 మంది ఎంపీటీసీలు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు కాంతమ్మ, రాజిరెడ్డి, నర్సింహ, గౌస్, శంకరయ్య, వసంత తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తంగెళ్ళ అల్వాల్ రెడ్డి, సాయిలు వున్నారు.
Admin
Kalam Power News