కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి గురు వారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధన కోసం దళితులు ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత సామాజిక వర్గానికి ఏ పదవులలో ఆశించిన స్థాయిలో సామాజిక న్యాయం జరగలేదు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి అంచలంచలుగా ఎదుగిన దళిత బిడ్డ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ను శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు జాతీయ మాలమహానాడు తరుపున కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.
Admin
Kalam Power News