కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : వనపర్తి జిల్లా ప్రతినిధి: కలం పవర్ న్యూస్: అహంకారానికి ఆత్మగౌరానికి జరిగిన యుద్ధంలో ఆత్మగౌరవం గెలుపొందిందని కాంగ్రె స్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ అన్నారు. సోమవారం మేఘా రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యే అభ్యర్థి తూడి మేఘారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన వనపర్తి నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా పాదాభివందనాలు తెలిపారు. ఈ గెలుపులో పాలుపంచుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రత్యేక నమస్కారాలు చెప్పారు. రానున్న భవిష్యత్ కాలంలో అందరికీ అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో వనపర్తిని అభివృద్ధి పథంలో ముందుంచుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, కాంగ్రెస్ పార్టీ నేత లక్కాకుల సతీష్, కౌన్సిలర్లు బ్రహ్మం, వెంకటేష్, జయసుధ, మధు గౌడ్, సుమిత్ర యాదగిరి, కో ఆప్షన్ సభ్యులు కైరున్ బేగం, మాజీ కౌన్సిలర్ చుక్కా రాజు, జయనందం మన్నెంకొండ, షఫీ, మురళి, దేవన్న, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News