కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ యడ్మసత్యం కుటుంబ సభ్యులు నిర్మించిన వై ఆర్ ఆర్ కాంప్లెక్స్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై అధికారులు వెంటనే నిగ్గు తేల్చాలని శుక్ర వారం స్థానిక కౌన్సిలర్లు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. కాంప్లెక్స్ నిర్మాణం ఎప్పుడు జరిగింది, అందులో ఎన్ని కమర్షియల్ దుకాణాలు ఉన్నాయి, నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై రోడ్డు ఆక్రమణ తదితర అంశాలపై వివరాలు అందజేయాలని కోరారు. కౌన్సిలర్ గోరేటి శ్రీనివాసులు, హూమ్లీ హనుమా నాయక్, ఎజాస్,గోపిరెడ్డి లక్ష్మిచిన్న రాం రెడ్డి,చందన శ్రీధర్ రెడ్డి తదితర కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు ఈ విషయంలో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు.
Admin
Kalam Power News