కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నారాయణపేట : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న మార్పుకే మఖ్తల్ ప్రజలు పట్టం కట్టారని బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి అన్నారు. మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు విజయం కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువజన కాంగ్రెస్ ,ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మఖ్తల్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో అఖండ మెజార్టీని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం మఖ్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అంతకుముందు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మఖ్తల్ నియోజకవర్గ అభివృద్ధికి గత ఎమ్మెల్యే ఎంత మాత్రం పాటుపడలేదని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు పెద్దపీట వేస్తోందని అన్నారు. పేద ప్రజల నేస్తం కాంగ్రెస్ పార్టీ అన్నది వాస్తవమని అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిష్కరించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 శాతం అమలు చేసి తీరుతామని గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేదే చెబుతుంది చెప్పింది చేసి చూపిస్తుందని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తోందని నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండు నెలల క్రితం చిట్టెం కో హటావో మఖ్తల్ కో బచావో అనే నినాదంతో ముఖ్యమైన నాయకులంతా కలిసి సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేసి ముందడుగు వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరికి టికెట్ వచ్చిన గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ప్రధాన డిమాండ్ చిట్టెం కో పటావో మక్తల్ కో బచావో అమలు చేసి తీరాలని చేసిన తీర్మానం మేరకు వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ టికెట్ వచ్చాక టికెట్ కోసం పోటీపడిన వారిలో తనతో పాటు మొత్తం ఏడు మంది పార్టీ నాయకులు కార్యకర్తలుతో కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందని అన్నారు.
Reporter
Kalam Power News