కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : మాల మహానాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కానుగడ్డ యాదయ్య ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో శుక్ర వారం మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పీవీ రావు 18 వ వర్ధంతి మరియు తెలంగాణ ఉద్యమకారుడు కాకా వెంకటస్వామి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తన స్వార్థం కొరకు దళితులను విడదీసి ఎస్సీలను విడదీసి ఎస్సీ వర్గీకరణ చేయించాడని, పివి రావు ఎస్సీలు అందరూ కలిసి ఉండాలని రాజ్యాధికారం సాధించాలని సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ జరగకుండా కేసు వేసి ఎస్సీ వర్గీకరణను జరగకుండా చేయించాడన్నారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగ అయి ఉండి కూడా మాలల కోసం మాలల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహా గొప్ప యోధుడు. కావున పివి రావు వర్ధంతిని తెలుగు రెండు రాష్ట్రాలలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజ్, మాల మహానాడు ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బా రాములు, ఉపాధ్యక్షులు బ్యాగరి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి గోకం చెన్నయ్య, జిల్లా నాయకులు వీరన్నపేట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News