కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : మూసాపేట మండల కేంద్రంతోపాటు సంకల మద్ది సంకల్ప సిద్ధి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆహ్వాన పత్రిక మరియు శ్రీరామ స్పర్శ అక్షింతలు అయోధ్య మందిర చిత్రం ఆహ్వాన పత్రం అక్షింతలు చేరుకోగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమం మూసాపేట ఆంజనేయస్వామి దేవాలయం నుండి సంకల్ప సిద్ధి గ్రామం ఆంజనేయస్వామి వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూసాపేట మరియు సంకలమద్ధి గ్రామాల పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News