కలం పవర్ న్యూస్ - తెలంగాణ / వనపర్తి : తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు, ఓటరు దేవుళ్లందరికీ తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన రుణం తీర్చుకోలేనిదని వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. విజయోత్సవం సందర్భంగా వనపర్తి శివారులోని మార్కెట్ యార్డ్ గోదాం ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. గత మార్చి నెల 9వ తేదీ నుంచి నేటి వరకు తనను వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటానని వారికి తప్ప కొత్తవారికి ఎవరికి కూడా తన వద్ద స్థానం ఉండదని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా ఆయన తనకు ఈ గెలుపునిచ్చిన వనపర్తి నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. అవినీతి అక్రమ నియంత పాలనలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తన వారిపై అధికార జులుం ప్రదర్శించారని అలాంటి వారిని గుర్తుంచుకొని మరి వడ్డీతో సహా లెక్క చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు.
Reporter
Kalam Power News