కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మిడ్జిల్ : గత కొంత కాలంగా తివ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందిన ఆవుల మల్లేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ అలాగే వారి యొక్క పసి పిల్లలను దృష్టిలో పెట్టుకొని వారి మిత్రులు, రూ. 30,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. గతంలో కూడా మిత్రుడు మల్లేష్ హాస్పిటల్ లో వున్న సమయంలో మెరుగైన వైద్యం అందాలని వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 54000 రూపాయలు కూడా అందించడం జరిగింది వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.డీ మాసుం బాబా, రాజేష్, పాండు ప్రకాష్ గౌడ్, రామాంజనేయులు గౌడ్, బాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News